తూ.గో.జిల్లా లో వైజ‌యంతి బ్యాన‌ర్‌కు పూజ‌లు

పిఠాపురం ద‌త్తాత్రేయ స‌న్నిధిలో ల‌క్ష్మీనారాయ‌ణ‌ద‌త్త హోమం

పిఠాపురం,(ADITYA9NEWS): సినీ నిర్మాత ఆశ్వినీద‌త్‌ కు చెందిన వైజ‌యంతి మూవిస్ నిర్మించ‌బోతున్న కొత్త చిత్రం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పూజ‌లు నిర్వ‌హించారు. ప్ర‌ముఖ ద‌త్త ప్ర‌చార‌కులు ల‌క్ష్మీనారాయ‌ణ ద‌త్త ఆధ్వ‌ర్యంలో పిఠాపురం పాద‌గ‌య క్షేత్రంలో కొలువైన స్వ‌యంభు ద‌త్తా త్రేయుడి స‌న్నిధిలో ద‌త్త‌ హోమం నిర్వ‌హించారు.

సినీనిర్మాత ఆశ్వినీద‌త్ ద‌త్త భ‌క్తులు కావ‌డం, పిఠాపురంలో ద‌త్త‌హోమం చేస్తే సినిమా విజ‌య‌వంతం అవుతుంద‌నే న‌మ్మ‌కంతో ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన‌ట్టు నారాయ‌ణ‌ద‌త్త వివ‌రించారు. కొత్త‌గా వ‌స్తున్న ఈసినిమాలో బాలివుడ్ దిగ్గ‌జం అమితాబ‌చ్చ‌న్‌, న‌టి దీపికా ప‌దుకునే, తెలుగు హీరో ప్ర‌భాస్, న‌టిస్తుండ‌గా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హైద‌ర‌బాద్ రామోజీ ఫిలింసిటీలో ఈనెల 24 నుండి షూటింగ్ ప్రారంభ‌మైంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :