తూర్పుగోదావరి ఉప్పాడలో ఘటన
ఉప్పాడ, (ADITYA9NEWS): తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ బీచ్ రోడ్డు రామన్న పాలెం ఉప్పుటేరు వంతెనపై ఒక కారు పల్టీ కొట్టి వంతెనపై అడ్డంగా తిరగబడింది. కారులో ఇరుక్కుపోయిన వ్యక్తిని నెమ్మదిగా బయటకు తీశారు. స్వల్ప గాయాలు కావడంతో అతడ్నిఆసుపత్రికి తరలించారు. కారు వంతెనపై అడ్డంగా ఉండిపోడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తృటిలో కారు ఉప్పుటేరులో వంతెనపై కిందకి పడే ప్రమాదం తప్పింది.
కారును భారీ క్రైన్ తో తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు ఉప్పాడ, కొత్తపల్లి పోలీసులు. ఇదిలా ఉండగా ఆదివారం సమయాల్లో మద్యం మత్తులో వేగంగా బీచ్‌రోడ్డులో కారులు తిరుగుండటం ప్రమాదాలకు సూచికగా మారింది. గత ఆదివారం ఏకంగా కారు సముద్రంలోకి వెళ్లిపోయింది. వెంటనే అక్కడే ఉన్న ఉప్పాడ బీచ్‌లోని పర్యాటకులు, నానా కష్టాలు పడి, బయటకుతీసి ఆరుగురి ప్రాణాలను కాపాడిన విషయం పాఠకులకు విధితమే.