తూర్పుగోదావరి మేడిచర్లపాలెంలో ఘటన
మలికిపురం,(ADITYA9NEWS): కోడలు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న కారణంగా , ఆమెను కత్తితో నరికి చంపాడు మామ. మలికిపురం మండలం మేడిచర్ల పాలెంలో ఈఘటన చోటు చేసుకుంది. చొప్పల ప్రియకు మూడేళ్ల క్రితం వివాహామైంది. ఆమె భర్త గల్ఫ్ దేశాలలో పొట్టకూటి కోసం వెళ్లి అక్కడ ఉంటూ, భార్య ప్రియకు డబ్బులు పంపిస్తున్నాడు. ఈనేపథ్యంలో అత్తమామలను జాగ్రత్తగా చూసుకుంటూ ఇళ్లు గడపాల్సిన ప్రియ తప్పుదారి పట్టింది. మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇది ఓర్వేలేని ఆమె మామ సత్యనారాయణ , అదును చూసి కత్తితో నరికి చంపాడు. అనంతరం మలికిపురం పోలిస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు