ఆ ఇంట ఒకేసారి ముగ్గురు మహాక్ష్మీలు జన్మించారు. తూర్పుగోదావరి జిల్లా
కొత్తపేట మండం కండ్రిగ గ్రామానికి చెందిన చిర్రా రమ్య (24)ఒకేసారి
ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. పురిటినొప్పులతో ఇబ్బంది
పడుతున్న ఆమె కొత్తపేటలోని భాస్కర్ చిల్డ్రన్ ఆసుపత్రిలో చేరింది.
ప్రసూతి విభాగం వైద్యురాలు దీప్తీ శస్త్ర చికిత్స చేసి ముగ్గురు
ఆడపిల్లలను బయటకు తీశారు. శిశువులు క్షేమంగా ఉన్నారని, వైద్య పరిభాషలో
ఈ శిశువులను ట్రిపులెట్స్‌గా పిలుస్తారని తెలిపారు. చిన్న పిల్లల
వైద్యుడు శ్రీధర్ పర్యవేక్షణలో చిన్నారులను ఉంచారు. తొలి కాన్పులోనే
ముగ్గురు ఆడ పిల్లలు పుట్టడం ఆనందంగా ఉందని కుటుంబసభ్యు తెలిపారు.
