ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను (2020–21) ప్రవేశపెట్టింది.
రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించింది.
అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా బడ్జెట్‌ను రూపొందించారు.
అచ్చమైన తెలుగు కవితతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి కవితతో ముగించారు.
గంటన్నరకు పైగా బుగ్గన బడ్జెట్ ప్రసంగం అద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగింది. ( ఈ రోజు జరిగిన అసెంబ్లీ లో బడ్జెట్ కార్యక్రమ చిత్రమాలిక వీక్షించవచ్చు)