మూడు రోజుల రష్యా పర్యటనలో భాగంగా బయలుదేరి వెళ్లిన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాస్కో చేరుకున్నారు.
విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను రష్యా మేజర్ జనరల్ కోసెంకో వాసిలీ అలెగ్జాండ్రోవిచ్, రష్యాలోని భారత రాయబారి డీబీ వెంకటేశ్ వర్మ స్వాగతం పలికారు.
75వ విక్టరీ డే సైనిక పరేడ్లో పాల్గొనున్న రాజ్నాథ్.
అనంతరం భారత్-రష్యా రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం దిశగా వివిధ స్థాయుల్లో ఆయన చర్చలు జరపనున్నారు.