ఆడు మగాడ్రా..! ఎవడైనా కోపంగా కొడతాడు..లేపోతే బలంగ కోడతాడు..
ఇదేట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు.. ఏది ఒక గోడ కడుతున్నట్టు, ..గులాభీ
మొక్కకు అంటుకడుతున్నట్టు చాలా జాగ్రత్తగా, పద్ధతిగా
కొట్టడ్రా..ఆడు మగడ్రా బుజ్జి.. ఈ డైలాగు అతడు సినిమాలో మహేష్‌బాబు
కొట్టిన దెబ్బకు తనికెళ్ల భరణి నోట వినబడే పంచ్‌డైలాగులు..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీలో నెలకొన్నవిభేదాలతో
నేతలు వదులుతున్న డైలాగులు చూస్తుంటే, ఓ పద్ధతిగానే శ్రద్ధగా
కొట్టుకుంటున్నట్టుగా ఉన్నాయి. ఇటీవల వైసీపీ నరసాపురం ఎంపీ రఘు
రామకృష్ణం రాజు వైసీపీ నేతల తీరుపై ఒంటి కాలుతో లేస్తున్నారు. తనకు
గౌరవం ఇవ్వడం లేదని, జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వనీయడం లేదని,
జగన్ వెనుక కోటరీ ఉందని, ఇలా దఫ దఫాలుగా వీడియోలు రిలీజ్ చేసి
వైసీపీ నేతలకు ఏకంగా సవాల్ విసిరి పక్కలో బల్లెంలా మారడం
రాజకీయాలను హిటెక్కించింది.
దీనిపై ఆగ్రహించిన వైసీపీ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రఘు
రామకృష్ణం రాజుకు వైసీపీ నేత విజయసాయి రెడ్డి ద్వారా నోటీసులు అందాయి.
దీంతో రాజు తన బాణాలను ఈసారి నేరుగా విజయసాయిరెడ్డిపైనే
ఎక్కిపెట్టారు. అసలు తనకు ఇచ్చిన నోటీసు వైసీపీ పార్టీతో
అడ్రస్‌తో ఉందని, కాని తాను ఉన్నది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్
పార్టీలో అంటూ తిరుగులేఖలో ఉటంకించారు. ఇలా చేయడం పట్ల వైసీపీ నేతలు
మండిపడుతుంటే, నేను అడుగుతున్నవన్ని నిజాలే కదా ..? అని రఘు
రామకృష్ణం రాజు తనదైన శైలిలో అడుగుతున్న ప్రశ్నలతో విచిత్ర
పరిస్థితిని నెలకొంది. ఆయన మాట్లాడిన తిరుగుబాటు మాటలే ఇప్పడు హాట్
టాపిక్ అయ్యాయి.
షోకాజ్ నోటీసు అందుకున్నరఘు రామ కృష్ణం రాజు తిరుగుబాటును ఈవిధంగా
చేస్తాడని ఆ పార్టీ నేతలు కూడా ఉహించి ఉండరు. ఎంపీగా ఉన్న రఘు
రామకృష్ణం రాజును పార్టీ నుండి మాత్రమే పంపిస్తే సరిపోదు, పార్టీ
ద్వారా అతడు పొందిన పదవినీ తప్పిస్తేనే రాజుకి గట్టి దెబ్బ
తగిలించొచ్చనేది వైసీపీ వూహ్యం.
కాని గ్రౌండ్‌లో పరిస్థితి చూస్తే మాటకు..మాట చెప్పడం, నోటీసిస్తే
.తిరిగి ప్రశ్నల నోటీసుతో
సమాధానం ఇవ్వడం వైసీపీకి కొరకురాని కొయ్యగా రాజు వ్యవహారశైలి
వైసీపీకి బొప్పికట్టినట్టుగా ఉంది.
ఇక్కడ రాజు తీరు చూస్తుంటే తన గెలుపు అనేది పార్టీ బలం కాదని, ఆయన
సొంత బలంగా చెప్పడంతో వైసీపీ అధినాయకులకు ఈ మాటలు కాక
రేపుతున్నట్టుగా ఉన్నాయి.
సాధారణంగా ఒక పార్టీలో ఉండి, నోటీసు అందుకున్న వారు సమాధానం ఇవ్వడం
అనేది పరిపాటి. అయితే ఇక్కడ సమాధానం ఇవ్వడం పక్కన పెడితే అసలు
మీరెవరూ నాకు నోటీసులివ్వడానికి అంటూ అన్సర్ లేని ప్రశ్నలతో
పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తుండటం గమనార్హం. ఈ ఏపీసోడ్‌లో రాజు
అడిగిన ప్రశ్నలకు వైసీపీ నేతలు సైతం సమాధానం వెతుకుంటున్నారంటే,
పరిస్థితి ఏలా ఉందో ప్రత్యక్షంగా కనబడుతుంది.
ప్రతిపక్ష పార్టీ నేతలు ఏదైనా అడిగితే ఏదో రకంగా డిబెట్‌లు పెట్టో,
మీడియాలో చెప్పో ఎదురు తిరగొచ్చు. కాని, మొత్తం వ్యవహారం ఒకే పార్టీలో
జరగడం, అందులోనూ సమాధానం దొరకని ప్రశ్నలు ఉండటంతో పార్టీ నేతలు
సైతం కంగుతిన్నారు.
ఇక ఆలస్యం చేస్తే తొండ ముదురుతుందని అనుకున్న పార్టీ సీనియర్లు, అదే
స్థాయిలో ఈవిషయమై గట్టిగానే సమాధానం ఇవ్వడానికి సమయాత్తం
అవుతున్నట్టు సమచారం.
ఇక్కడ ప్రజాప్రతినిధిగా, పార్టీ నాయకుడిగా రెండు వైపులా రఘు
రామకృష్ణం రాజు ఆలోచనకు పదును పెట్టి, ఎవరైతే నోటీసు పంపించారో
వారిపైనే బాణం ఎక్కు పెట్టి సతాయించడం చూస్తుంటే, రాబోవు కాలంలో
రాజకీయాలతో పాటు, పార్టీల జాగ్రత్తలను గుర్తు చేసినట్లుందని
రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. ఈ రాజు-రెడ్డిల వ్యవహారం ఇంకెన్ని
మలుపులు తిరుగుతుందో, ఇంకెన్ని ట్విస్ట్‌లు చూడాలనేది ఆసక్తికరంగా
మారింది.
