పెళ్లి కొడుక్కి కరోనా.. 500 మందికి భోజనాలు 

వివాహానికి హాజరైన వారిలో టెన్షన్

కోటవురట్ల మండలం కొడవటిపూడి గ్రామానికి చెందిన పెళ్లి కుమారుడికి ఆదివారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో బంధు వర్గాల్లో కలవరం మొదలైంది. గ్రామానికి చెందిన 31 ఏళ్ల యువకుడు రంగారెడ్డి జిల్లా నుంచి 20 రోజుల కిందట వచ్చాడు. ఇతనికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ నెల 5న వీఎల్‌ఎం కిట్‌తో కోవిడ్‌ పరీక్ష చేసి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి నమూనా పంపించారు.

ఫలితం రాకముందే యువకుడు ఈ నెల 15న రావికమతం గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఆదివారం కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో అంతా హతాశులయ్యారు. అదే గ్రామంలో చర్చిలో జరిగిన వివాహానికి పాస్టరుతో పాటు ఇరువైపులా బంధువులు సుమారు 90 మంది పాల్గొన్నారు. అదే రోజు మధ్యాహ్నం ఇంటి దగ్గర పెట్టిన భోజనాల కార్యక్రమంలో సుమారు 500 మందికి పైగా పాల్గొన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. పెళ్లి కొడుక్కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వివాహానికి హాజరైన వారిలో టెన్షన్‌ మొదలైంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :