పార్లమెంట్ మెంబర్‌గా ఉన్న ఆమె చూపు పిఠాపురం వైపే.
రాజకీయంగా ఆమె ఓ సీనియర్. అవగాహనలో ఆమెది అందవేసిన చేయి. ఆలోచనతీరులోనూ, ప్రజాకర్షణలో దూసుకుపోయే తత్వం. వివాదాలకు దూరం. ఎన్నివిమర్శలు చేసినా స్పందించని ఆమె నైజం. ఎవ్వరికైనా చిరునవ్వుతోనే సమాధానం. మరోపక్క అందివచ్చిన సామాజిక వర్గం. వీటన్నింటితోపాటు
కలిసొచ్చిన కాలం. కాకినాడ పార్లమెంట్ మెంబర్ గా *గీత* దాటని అదృష్టం.
కాకినాడ ఎంపీ వంగా గీత రాజకీయ ప్రస్థానం తెలియని వారుండరు.
తెలుగుదేశంలో అంచెలంచెలుగా ఎదిగన తర్వాత పీఆర్పీలో చిరంజీవి వద్ద సైతం మార్కులు కొట్టేశారమే. తరువాత 5 ఏళ్ల పాటు రాజకీయంగా ఏపార్టీకి అనుకూలంగా, ప్రతికూలంగానూ కాకుండా నిశబ్ధ రాజకీయమే నడిపారమే.వైసీపీకీ , దగ్గర కాలేదు. జగన్ పాదయాత్రలో కూడా ఆమె పాత్ర లేదు. కాని అనూహ్యంగా గత ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ టిక్కెట్ రావడంతో జగన్ గాలిలో గీతకు అదృష్టం
కలిసొచ్చింది. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఆమె పరిధిలోనివి. తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ, కాకినాడ రూరల్, పెద్దాపురం,జగ్గంపేట నియోజకవర్గాలకు పార్లమెంట్ మెంబర్‌గా ఆమె ప్రాతినిధ్యం వహిస్తోంది. వీటన్నింటిలో అత్యధికంగా ఆమె చూపు ఎప్పుడూ పిఠాపురం వైపే ఉంటుందని చెప్పుకోవాలి. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుండి పిఠాపురం
ఎమ్మెల్యేగా గెలుపొందిన గీత పిఠాపురంలో తనదైన గుర్తింపుతో దూసుకెల్లారు.
మరోవైపు సామాజికపరమైన అంశం ఆమె కలిసొచ్చింది. పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబుతో పోలిస్తే వంగా గీత అభివృద్ధి పరంగా అవగాహనతో ముందుకెళ్లడం ఆమెకు కలిసొచ్చే అంశం. రాబోవు కాలంలో గీత గురంతా పిఠాపురం నుండే ఉంటుందన్నది వేయి నోళ్లకు సమాధానం. తాజాగా గీత కేంద్ర రహదారుల నిధుల కింద రూ.20 కోట్లతో శంకుస్థాపనలను పిఠాపురంతోనే ప్రారంభించారు.
అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకొస్తున్న నిధులు కూడా ఎక్కువగా
పిఠాపురానికే కేటాయించడం ఆమె చూపు పిఠాపురం వైపే అనే ప్రశ్నకు
సమాధానంగా మారింది.
ఎమ్మెల్యే పెండెం దొరబాబు వద్ద ఉన్న వర్గం కూడా ఎక్కువగా గీత పాటపాడటం. వైసీపీలో ఆమె సమర్థవంతమైన నాయకురాలిగా గుర్తింపు పొందడంతో పిఠాపురం వైసీపీ వర్గం ఎక్కువగా గీత వైపే మొగ్గు చూపుతున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశం. దీంతోపాటు త్వరలో పిఠాపురంలో పూర్తిస్థాయిలో రాజకీయ చక్రం తిప్పేందుకు వంగా గీత తనకంటూ ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలనే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏదేమైనా రాబోవు ఎన్నికలకు ఇప్పటి నుండే క్షేత్రస్థాయి ప్రణాళికలను సిద్ధం చేసుకోవడంలో వైసీపీ నుండి గీత కూడా ఉన్నట్టు, ఆమె పిఠాపురం నుండే పోటీ అన్నట్టుగా ప్రచారం జోరందుకుంది. ఎవరి భవిష్యత్తు ఏంటనేది ఇక కాలమే నిర్ణయించాలి.