తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పిఠాపురం ఉప్పాడ బస్టాండు వద్ద వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు రక్తదానం చేశారు. ఎమ్మెల్యే దొరబాబు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. జగన్మోహన్రెడ్డి జన్మదినం ఒక పండగ అని, ఆయన పేదలపాలిట దేవుడిచ్చిన వరమని ఎమ్మెల్యే దొరబాబు అన్నారు. ఈసందర్భంగా కేక్ కట్ చేసిన దొరబాబు సంతోషం వ్యక్తం చేసి ఆనందాన్ని అభిమానుల అందరితో పంచుకున్నారు.
